
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 అక్టోబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: గత 18 సంవత్సరాలుగా పనిచేయుచున్న డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్య సేవ
ఫీల్డ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...
అయ్యా,
డా॥ ఎన్‌టిఆర్ వైద్యసేవ ఫీల్డ్ సిబ్బంది (వైద్య మిత్ర, టీం లీడర్,
ఆఫీస్ అసోసియేట్ జిల్లా మేనేజర్లు) ఉద్యోగులుగా 2007 సంవత్సరం నుండి
పనిచేస్తున్నారు. వీరికి ఏకైక జీవనోపాధి ఈ చిరుద్యోగం మాత్రమే. నెలసరి జీత
భత్యము రూ.13,087లుతో యావత్ కుటుంబం ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ
డిగ్రీ, పి.జి, బిఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బి.ఫార్మసీ,
ఫార్మా డి చదువుకున్నవాళ్ళు. వీరు గత 18 సంవత్సరాలుగా చేస్తున్నా ఉద్యోగ
భద్రత లేదు.
పత్రికలలో, మీడియాలో వస్తున్న దాన్నిబట్టి డా॥ ఎన్‌టిఆర్ వైద్య సేవ
ట్రస్టును ట్రస్టు పరిధి నుంచి మినహాయించి హెల్త్ భీమా అమలు పథకం
మార్పునకై ప్రభుత్వ యోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా ఉద్యోగాలు
కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వీరికి ఉద్యోగ భద్రత
కల్పించవలసిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org