
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 28 సెప్టెంబరు, 2024.
విజయభారతి మృతికి సంతాపం
సాహిత్య రంగంలో, అలాగే బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన పముఖ రచయిత్రి, తెలుగు అకాడెమీ మాజీ చైర్‌పరస్సన్ బొజ్జా విజయభారతి (83) మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. బోయి భీమమన్న కుమార్తెగా, మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించిన న్యాయవాది బొజ్జా తారకం సతీమణిగానే కాకుండా రచయితగా తనదంటూ ఒక స్థానాన్ని ఆమె ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి