భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 31 ఆగష్టు, 2024.
నేడు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందటం,
పలువురు గాయపడటం విచారకరం. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల
రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య
సౌకర్యం అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
అలాగే ఈ ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి.
భవిష్యత్తులో కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తగు
ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలను
రక్షించడానికి కావలసిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. కొండ ప్రాంతాల్లో
రక్షణ చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన
నిధులు కేటాయించి ప్రజలను రక్షించాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org