ప్రపంచ జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన షేక్‌ సాదియా అల్మాస్‌ కు అభినందనలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఆగష్టు, 2024.

 

ప్రపంచ జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన షేక్‌ సాదియా అల్మాస్‌ కు సిపిఐ(యం) రాష్ట్ర కమిటి అభినందనలు తెలియజేస్తున్నది.

మాల్టాలో జరుగుతున్న జూనియర్‌ అమ్మాయిల 57 కేజీల విభాగంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా స్వర్ణం సొంతం చేసుకుంది. సాధియా ప్రపంచ వేదికలపై మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. యువతీ, యువకులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుతున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి