
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 ఆగష్టు, 2024.
గ్రూప్-1 ప్రిలిమ్స్ నుండి మొయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేస్తున్నది.
గ్రూప్ -2, డిప్యూటీ డీఈఓ పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించారు. దీనినే గ్రూప్-1 ఎంపికలో కూడా కొనసాగించడం ఉపయోగకరంగా ఉంటుంది. గ్రూప్ -2, గ్రూప్ -1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, ప్రశ్నాపత్రంలో అనువాద సమస్యలు, కేవలం మూడు వారాల వ్యవధిలోనే రెండు పరీక్షలు జరగాయి. వాటితో పాటు ఎన్నికల ఒత్తిడి, గ్రూప్ `1 సిలబస్‌ను రివిజన్ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అనిచెప్పి పాత సిలబస్‌లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడంతో అభ్యర్ధులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అభ్యర్ధుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి