రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో.నెం.610ని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమలు నిమిత్తం, శెట్టిపల్లి గ్రామంలోని హక్కుదారులకు అవకాశం కల్పించడం గురించి

(ప్రచురణార్థం: మాజీ పార్లమెంటు (రాజ్యసభ) సభ్యులు పెనుమల్లి మధు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

విజయవాడ,

 తేది : 20 ఆగష్టు, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో.నెం.610ని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమలు నిమిత్తం, శెట్టిపల్లి గ్రామంలోని హక్కుదారులకు అవకాశం కల్పించడం గురించి...

అయ్యా!

తిరుపతి జిల్లా శెట్టిపల్లి గ్రామంలోని 630 ఎకరాల ఇనాము భూముల్లో రైతులు 100 సంవత్సరాలుగా అనుభవదారులుగా ఉన్నారు. గ్రామం 30 ఎకరాలు, చెరువు 60 ఎకరాలు కలిగి ఉండగా రైల్వే కోచ్‌ రిపేర్‌ వర్క్‌ షాపుకు రైతులు 83 ఎకరాలు ఇచ్చారు. ప్రస్తుతం రైతులు 257 ఎకరాలలో వ్యవసాయం చేస్తుండగా, మిగిలిన 200 ఎకరాలు తమ అవసరాల కోసం  ప్రజలకు ఇళ్ళ స్థలాలుగా రైతులు అమ్మారు. 3000 మంది తిరుపతి వాసులు స్థలాలు కొని రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు.

2019లో టిడిపి ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన సందర్భంగా మొత్తం భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని రైతులకు 30% భూమిని ఇచ్చేటట్లు, అలాగే ప్లాటు యజమానులకు 50% భూమిని ఇచ్చేటట్లు, (కనీసం రెండు సెంట్ల భూమితో ప్రారంభించి)  జి.వోలో పేర్కొన్నారు. ఈ మేరకు జివో నెం : 173ని నాటి ముఖ్యమంత్రిగా తమరు విడుదల చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ కారణంగా ప్రభుత్వానికి 140 ఎకరాల విలువైన భూమి దక్కుతుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి (తుడా) ద్వారా సర్వేచేసి అర్హుల జాబితాను ప్రకటించింది. కానీ పంపకం చేయలేదు.

2023లో శెట్టిపల్లి గ్రామం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం కావడం వలన భూమి మొత్తం కార్పొరేషన్‌కు అప్పగిస్తూ జివో నెం : 610ని విడుదల చేశారు. అర్హులకు ప్రొసీడిరగ్‌ ఆర్డర్‌ నెం : Roc  G 1170/2023 ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా భూమిని  ప్లాట్లు వేసి లబ్ధిదారులకు అప్పగించడం వాయిదా పడిరది. దీని కారణంగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. 

సంవత్సరాల తరబడి పెండిరగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి తమరు జోక్యం చేసుకొవాలని కోరుతున్నాను. పేదలకు న్యాయం చేకూర్చగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభివందనములతో...

(పెనుమల్లి  మధు)

మాజీ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ)

 

జతపరుస్తున్నది :

1. జిఓయంఎస్‌ నెం : 610 - 2023

2. జిఓయంఎస్‌ నెం : 173 - 2019