
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 ఆగష్టు, 2024.
నలుగురు గిరిజన విద్యార్థుల మృతిపట్ల సిపిఐ(యం) దిగ్బ్రాంతి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు గిరిజన విద్యార్థులు మృతిచెందటం పట్లం సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. మరణించిన విద్యార్థులకు సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.
కలుషిత ఆహారం తిని రెండు రోజుల క్రితం 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు ఈరోజు మృతి చెందారు. ఇంకా ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థకు గురై చికిత్స తీసుకుంటున్న వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేస్తున్నది. సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నది.
మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి