
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 ఆగష్టు, 2024.
కామ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం
సిపిఎం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి (90) శుక్రవారం రాత్రి (16.08.2024) రాజమండ్రి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.
శ్రీరామ్మూర్తి 1984లో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా, నర్సాపురం డివిజన్ పార్టీ బాధ్యతలు వహించారు. దీర్ఘకాలం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా పని చేశారు. త్యాగనిరతితో, పార్టీ పట్ల అంకితభావంతో పార్టీ, ప్రజాసంఘాలలో పనిచేశారు. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యం ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకు పార్టీ పట్ల అచంచల విశ్వాసంతో కార్యక్రమాల్లో పాట్గొంటూ వచ్చారు. పార్టీ, ప్రజాసంఘాల పత్రికలను చేర్పించడంలో పట్టుదలతో కూడిన కృషి ఆదర్శనీయమైనది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి