
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 ఆగష్టు, 2024.
కోల్‌కత్తాలో పిజి వైద్య విద్యార్థినిపై అఘాయిత్యం, హత్యకు నిరసనగా ఈ రోజు మన రాష్ట్రంలో, దేశవ్యాపితంగా జరుగుతున్న డాక్టర్ల సమ్మెకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేస్తున్నది. హత్య వెనుక డ్రగ్ మాఫియా, సంఘవ్యతిరేక శక్తులున్నట్లు రకరకాల కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఘటనపై సమగ్ర విచారణ త్వరితగతిన పూర్తిచేసి దోషులను శిక్షించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. మన రాష్ట్రంలో కూడా డాక్టర్లకు ప్రత్యేకించి మహిళా డాక్టర్లు, నర్సులు, ఇతర మహిళా స్టాఫ్‌కు భద్రతకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి