జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రమాదంపై

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ   

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జూలై, 2024.

 

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కాపాడాలి. గాయపడిన తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని అందించాలి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన వారిని సిపిఐ(యం) బృందం ఆసుపత్రిలో పరామర్శించింది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి