భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 జూన్, 2024.
ఈనాడు సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత శ్రీ రామోజీరావు గారి మరణం బాధాకరమని సిపిఐ(యం) పధాన కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి, పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. శ్రీ రామోజీరావు తెలుగు మీడియా రంగానికి నూతన వరవడి దిద్దారని, పత్రికా విలువలు నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. సుందరయ్య, రాజేశ్వరరావు లాంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుల్ని ఎంతో అభిమానించేవారని తెలియజేశారు. రామోజీరావు గారి మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి లోటని పేర్కొన్నారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి