ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారి మృతి విచారకరం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్‌, 2024.

 

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారి మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రామోజీరావు మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావు గారిది. పత్రికను మారుమూల గ్రామాలకు కూడా చేర్చటం, స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేకంగా టాబ్లాయిడ్లు తీసుకురావటం,  ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధికి మీడియాను ఉపయోగించటం వంటి అనేక అంశాలు తెలుగు జర్నలిస్ట్‌ చరిత్రలో కలిపి తూరాయిగా మిగిలిపోతాయి. అలాగే ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కూడా. రామోజీ ఫిలింసిటీ నిర్మించి సినిమా ఇండస్ట్రీకి తోడ్పడ్డారు. ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చేసిన సమయంలో జరిగిన ప్రజాసామిక ఉద్యమానికి పూర్తి అండదండలిచ్చారు. సారా వ్యతిరేక ఉద్యమంలో ముందు పీట్టీన నిలిచారు. తెలుగు ప్రముఖుల్లో ఒకరైన రామోజీరావు గారి మృతి తీరని లోటు. వారి మృతికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

 

 (జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి