కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకవుట్‌ వలన కార్మికులకు రావలసిన నష్ట పరిహారం గురించి..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

16 మే, 2024.

 

శ్రీయుత కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి గారికి,  

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయము: కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకవుట్‌  వలన కార్మికులకు 

రావలసిన నష్ట పరిహారం గురించి..

 

ఎ.సి.సి.సిమెంటు కంపెనీ యాజమాన్యమునకు చెందిన గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని కృష్ణా సిమెంటును యాజమాన్యం ది.29.05.1993న అక్రమ లాకవుట్‌ను ప్రకటించింది. ఈ  లాకవుట్‌పై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము లాకవుట్‌ అక్రమం అని జివో ఇచ్చింది.

అయినా కంపెనీ యాజమాన్యం లాకవుట్‌ ఎత్తివేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంతో కార్మికులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. కంపెనీ సంబంధిత ఆస్తులు అమ్మి కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని  హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆస్తులను ఎవరైతే వేలంలో పాడుకుంటారో వారే కార్మికులకు బకాయిలు చెల్లించాలని వేలం షరతులలో పొందుపర్చడం జరిగింది.

లాకవుట్‌ ప్రకటించి నేటికి 31 సం॥లు పూర్తయ్యింది. సూమారు 150 మందికి పైగా కార్మికులు చనిపోయారు. కావున మీరు జోక్యం చేసుకుని సంబంధిత యాజమాన్యం నుండి కార్మికులకు రావలసిన నష్టపరిహారమును వచ్చే విధంగా కృషి చేయవలసిందిగా, అందుకు అవసరమైన సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుచున్నాను.

అభినందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి