భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 08 మే, 2024.
వెంకటాయపాలెం శిరోమొండనం కేసు తీర్పు అమలు నిలిపివేయడం విచారకరమని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 సంవత్సరాల తరువాత వచ్చిన ఈపాటి తీర్పును కూడా నిలిపి వేయడం దళితులకు రక్షణ లేకుండా పోయే పరిస్తితిని కల్పిస్తుంది. పెత్తందార్లు మరింత పేట్రేగి పోతారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని తీర్పు అమలయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి