
మనదేశానికి స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాలు అవుతున్నా దళితు స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. అంటరాని తనం, దాడులు, స్త్రీలపై అత్యాచారాలు, మానభంగాలు కొనసాగుతూనే వున్నాయి. అందుచేతనే రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం కనీసం నాలుగు రోజులు నిర్వహించి దళిత సమస్యపై చర్చించి పరిష్కారానికి కొన్ని చట్టాలు రూపొందించాని సిపియం డిమాండ్ చేస్తున్నది.
ప్రయివేటు రంగం రోజు రోజుకి పెరిగి పోతున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణ జోరు మరింత పెంచుతున్నది. దీనివల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కనుక ప్రయివేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని అందుకు పార్లమెంటు వెంటనే చట్టం చేయాలని సిపియం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు ముఖ్యంగా సిపియం పార్టీ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం రూపొందించింది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాపిత ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం రూపొందించాని సిపియం పార్టీ దేశవ్యాపితంగా ప్రచారం చేస్తున్నది. అదే విధంగా దళితులు బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాని సిపియం పార్టీ డిమాండ్ చేస్తున్నది.
మనదేశంలో వేలాది సంవత్సరాలుగా కొన్ని కులాల ప్రజలు సమాజంలో వెలివేయబడి ఊరికి దూరంగా, అంటరానితనంతో మగ్గుతున్నారు. తరాలు మారినా వీరి బ్రతుకుమాత్రం మారడంలేదు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. మానవ రహిత రాకేట్లను మనదేశం ప్రయోగిస్తున్నది. అగ్ర రాజ్యాతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతున్నది. కానీ మనదేశంలో కొన్ని కులాల ప్రజలను నేటికీ అంటరానివారిగా పరిగణిస్తూ ఆ ప్రజలపట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు. ఈ కులాల ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో వున్నారు. నేటికీ అక్ష్యరాస్యతలో అగ్రకులాలతో పోలిస్తే వెనుకబడే వున్నారు. వీరు కాపురముంటున్న నివాసప్రాంతాలు, దళిత పల్లెల్లొ మురికి కూపాలుగా దర్శనమిస్తాయి. ఊర్లో వర్షం కురిసిందంటే ఆ ఊరిలోని మురికి నీరంతా ఈ పల్లెలో వుండవసిందే. అగ్రకుల పేటల్లో పక్కా సిమెంట్ రోడ్లు, మురికి నీరు పోవడానికి మురికి కాలువలు వుంటాయి. కానీ దళితపేటల్లో నేటికీ గతుకు రోడ్లు దర్శనమిస్తుంటాయి. నూటికీ కోటికీ ఎక్కడో ఇటీవల దళితపేటల్లో సిమెంటు రోడ్లు కనిపిస్తున్నాయి. కానీ ఏ దళితపేట గాలించినా, రాష్ట్రంలో ఏ మారుమూ పల్లెకు పోయినా ఎక్కడా డ్రైనేజీ సౌకర్యం కనిపించదు. ఇదీ నేటికీ స్వతంత్య్రం వచ్చి 68సంవత్సరాు అవుతున్నా దళితలు దౌర్భాగ్య పరిస్థితి. అందుచేతనే అగ్ర కులాల ప్రజలతోపాటుగా దళిత ప్రజు సమానంగా బ్రతకాంటే దళితుకు సామాజికన్యాయం దక్కాలి. దళితుకు సామాజికన్యాయం దక్కేవరకు సిపియం పార్టీ పోరాడుతున్నది.