భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 మే, 2024.
ప్రధాని మోడీ పర్యటనలో నిర్భందం
ప్రధాని మోడీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ప్రజలపై ఆంక్షలతో నానా అవస్థలు పడుతున్నారు. రోజంతా విజయవాడ దిగ్భంధంలో ఉంది. ఏపి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తదితరులను నిర్భందించడం అక్రమం. ప్రతిపక్ష నాయకుల్నే కాదు, స్వపక్ష నాయకుల్ని కూడా అక్రమంగా నిర్భంధించడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చనీ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్డీఏ కూటమి తరపున రోడ్‌షో లో ప్రధాని పాల్గొనబోతున్న సందర్భంలో అరెస్టులు చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. ఈ నిర్భందం పై ఎన్నికలు కమిషన్ జోక్యం చేసుకొని వివరణ ఇవ్వాలి. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి