పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 మార్చి, 2024.

 

పెన్షన్లు సకాలంలో అందేటట్లు చూడాలి

 

ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ నిలిపివేయడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్దులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్లు అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఆ మేరకు ఎన్నికల కమీషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేస్తూ లేఖ పంపింది. ఇందుకు గ్రామ, వార్డు సచివాలయం, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకొని గతంలోలాగానే నేరుగా పెన్షన్‌దారులకు అందించాలని కోరుతున్నది. సచివాలయాలు దూరంగా ఉన్నచోట దగ్గరలో ఉండే పంచాయతీ కార్యాలయాలు, సిబ్బందిని కూడా దీనికి ఉపయోగించుకోవాలి.

రాజకీయంగా న్యూట్రల్‌గా ఉంచి సంక్షేమ పథకాలను అందించాల్సిన వలంటీర్‌ వ్యవస్థను రాజకీయ అవసరాలకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగం చేస్తున్నదని గతంలో సిపియం పదే పదే ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దాని ఫలితంగానే ఈరోజు సకాలంలో పెన్షన్లు అందించలేని దుస్తితి ఏర్పడిరది. ఇప్పటికైనా వలంటీర్‌ వ్యవస్థ తటస్థంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి