అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మార్చి, 2024.

అర్చకుడు వెంకట సత్యసాయిపై దాడికి పాల్పడిన
వైకాపా మాజీ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

        కాకినాడ నగరం దేవాలయం వీధిలో ఉన్న శివాలయంలో పూజారి వెంకట సత్యసాయిని
అసభ్య పదజాలంతో దూషిస్తూ, చెంపపై కొట్టడం, కాలితో తన్నడం లాంటి చర్యలకు
పాల్పడిన వైకాపా మాజీ కార్పోరేటర్‌ సిరియాల చంద్రరావుని తక్షణం అరెస్ట్‌
చేయాలని సిపియం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.
        అధికార మదంతో దేవాలయ పూజారులపై దాడులు చేయడం, దుర్భాషడేవారిపట్ల ఉదారంగా
వ్యవహరించడం తగదని అధికార పార్టీని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వైకాపా
మాజీ కార్పోరేటర్‌ సిరియాల చంద్రరావుని అరెస్ట్‌ చేయకుండా దేవాదాయ శాఖ
అధికారుల ద్వారా రాజీ నాటకాలు ఆడిరచి రహస్యంగా క్షమాపణ చెప్పించడం
విడ్డూరంగా ఉంది. తాను క్షమాపణ చెప్పలేదని చంద్రరావు బహిరంగంగా ప్రకటించడం,
ప్రాణహాని ఉందని పూజారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే
నామమాత్రపు 47ఎ సెక్షన్‌ క్రింద కేసు బుక్‌ చేయడం బాధితులకి విశ్వాసం
కలిగించదు. పూజారి కుటుంబానికి రక్షణ కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్‌
చేస్తున్నది.
        ఈ ఘటన ఆసరా చేసుకొని కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులు మత ఉద్రేకాలు
సృష్టించే ప్రయత్నాలను అధికార యంత్రాంగం నిరోధించాలని సిపిఐ(యం) రాష్ట్ర
కమిటీ కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి