భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 మార్చి, 2024.
ఎన్నికలలో కరపత్రాల పంపిణీకి అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను, ఇంటింటి క్యాంపెయిన్ కోసం 48 గంటల ముందు రిటర్నింగ్ ఆఫీసరుల అనుమతి తీసుకోవాలనే అంశంపైన పునఃపరిశీలన చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో సిపిఐ(యం) ప్రతినిధి బృందం కోరింది.
రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన జెండా పోల్స్, బ్యానర్స్ తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని, మేడే కి ఎటువంటి ఆంక్షలు లేకుండా కార్యక్రమం నిర్వహణకు అనుమతించాలని కోరారు. కర్నూలు, రాజమండ్రి జిల్లాల్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు జెండా పోల్స్, జెండా దిమ్మెలు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇతర జిల్లాల్లో తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2019లో బైండోవర్ కేసుల పేరుతో పార్టీల కార్యకర్తలను స్టేషన్స్‌కి పిలిచి వేదించడం సరికాదని తెలియజేశారు.
ఈ సమావేశానికి సిపిఐ(యం) నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్ హాజరయ్యారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి