ఎలక్ట్రోరల్‌ బాండ్ల ఎవరి ద్వారా ఎంత మొత్తం నిధులు అందాయో వివరాలు వెల్లడించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 మార్చి, 2024.

 

తెలుగుదేశం, వైసిపి, జనసేన పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల ఎవరి ద్వారా ఎంత మొత్తం నిధులు అందాయో వివరాలు వెల్లడిరచాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఎలక్ట్రోరల్‌ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీం ధర్మాసనం స్పష్టంగా తన తీర్పులో వెల్లడిరచింది. ఈ బాండ్ల వ్యవహారం అతిపెద్ద స్కామ్‌. మొత్తం బాండ్లలో సగం 6,565 కోట్లు బిజెపి పార్టీకే అందాయి. అధేవిధంగా రాష్ట్రంలో వైసిపికి 337 కోట్లు, టిడిపికి 218.88 కోట్లు, జనసేనకు 21 కోట్లు కార్పొరేట్‌ సంస్ధల ద్వారా అందాయని ఎన్నికల కమీషన్‌ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి. మీడియాలో కూడా వచ్చింది. దీనికి ఈ పార్టీలు సమాధానం చెప్పాలి. విశ్వసనీయత, పారద్శకత, నీతి నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్‌ మోహన్‌ రెడ్డి బాండ్ల ద్వారా అందిన నిధుల విషయాన్ని ప్రజలకి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి గురించి, స్కామ్‌ల గురించి ‘‘0’’ బడ్జెట్‌ పాలిటిక్స్‌ గురించి రోజూ మాట్లాడే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు సమాధానం చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రోరల్‌బాండ్ల వ్యవహారంపై చర్చ జరుగుతుంటే వైసిపి, టిడిపి, జనసేనలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీల జెండా రంగులే వేరు ఎజెండా ఒక్కటేనని దుయ్యబట్టారు. రాజకీయాలను డబ్బులు ఏస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ప్రజలకు అర్ధమవుతుందన్నారు.

ఎలక్ట్రోరల్‌ బాండ్లను రద్దు చేయాలని సిపిఎం మొదటి నుండి పోరాడుతుందని, సుప్రీంలో కేసు వేసి చివరి వరకూ పోరాడిరదన్నారు. ఈ బాండ్లు తీసుకోని పార్టీలు వామక్షాలు, సిపిఐ(యం) మాత్రమేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి సమాచారం చాలా అవసరం. ఎలక్ట్రోరల్‌ బాండ్లు చట్టబద్ధ క్విడ్‌ప్రోకో అని విమర్శించారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా ఏ పెట్టుబడిదారుడు, ఏ కంపెనీ ఎంత మొత్తం ఇచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

 

   (జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి