ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని

ప్రచురణార్థం : ఈ రోజు ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గార్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

రాసిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 15 మార్చి, 2024.

 

ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గారికి,

ఆంధ్రప్రదేశ్‌,

రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.

 

విషయం: ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ...

అయ్యా!

వలంటీర్లను ఎన్నికల విధులకు, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమీషన్‌ , న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వలంటీర్లకు గిఫ్ట్‌ బాక్సులు, తాయిలాలు ఇచ్చి వారిని ప్రలోభపెడుతున్నారు. మీరే (వలంటీర్లు) పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని బహిరంగంగా మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లతో పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్ధుల సభల్లో, కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పత్రికల్లో వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎం.ఎల్‌.ఎలు, మంత్రుల ప్రొద్భలంతో వాలంటీర్లకు ఓటర్ల లిస్టులు ఇచ్చి ప్రభావితం  చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాదృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి వార్తలు రోజూ పత్రికల్లో వస్తున్నాయి. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శ