ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం గురించి...

(ప్రచురణార్థం : ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎలక్టోర్‌ ఆఫీసర్‌ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశానికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం, కె.హరికిషోర్‌లు హాజరయ్యారు. బిజెపి, వైసిపి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై సిఇఓకు మెమోరాండం సమర్పించారు. మతాన్ని ఉపయోగిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగులు కోడ్‌ రాగానే తొలగిస్తామని హామీనిచ్చారు. మెమోరాండం కాపీని ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము.    - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 07 మార్చి, 2024.

ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌,

ఎన్నికల కమీషన్‌ ఆఫ్‌ ఇండియా,

రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.

 

విషయం : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం గురించి...

అయ్యా!

మతాన్ని ఎన్నికలలో ఓట్లకోసం ఉపయోగించకూడదని స్పష్టంగా ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ చెబుతున్నప్పటికీ బిజెపి పార్టీ రామాలయం ఫోటోలు, బిజెపి పార్టీ గుర్తు, నాయకులు, అభ్యర్థుల ఫోటోలతో ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టారు. ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్దం. విగ్రహాలకు ముసుగువేస్తున్న నేపథ్యంలో ఇటువంటి హోర్డింగులు పెట్టడం ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభపెట్టడమే. మీరు తక్షణం ఈ హోర్డింగులను తొలగించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికలు పూర్తియ్యే వరకు మీరు మతాన్ని, దేవుళ్ళను ఉపయోగించే చర్యలను నిరోధించాలని కోరుతున్నాను. (ఫోటోలు జతపరుస్తున్నాను)

ఎన్నికల విధులలో వలంటీర్లను ప్రధాన బాధ్యతల్లో ఉపయోగించరాదని ఎన్నికల కమీషన్‌, కోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర మంత్రులు బహిరంగ సభల్లో, సమావేశాల్లో వలంటీర్లు వైసిపి గెలుపుకు తోడ్పడాలని వాఖ్యలు చేస్తూ పదే పదే ఉల్లంఘిస్తున్నారు. వలంటీర్లతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వలంటీర్లకు తాయిలాలు పంచుతున్నట్లు పత్రికల్లో వస్తున్నాయి.వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి