వికలాంగుల డిమాండ్స్‌కు సిపిఐ(ఎం) మద్దతు... వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 మార్చి, 2024.

వికలాంగుల డిమాండ్స్‌కు సిపిఐ(ఎం) మద్దతు
        వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) విహెచ్‌పిఎస్‌ సంఘాలు ఈ రోజు
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావును కలిసిన సందర్భంలో
వికలాంగుల డిమాండ్స్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. 2016 వికలాంగుల చట్టం
అమలు చేయాలని, వికలాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3000 పింఛనును రూ.6000కి
పెంపు, అన్నిరకాల బస్సు సర్వీసుల్లో వికలాంగులు ఉచితంగా ప్రయాణించేలా
చర్యలు చేపట్టడం, బడ్జెట్‌లో 5% నిధులు కేటాయింపు, అర్హులందరికీ ఎటువంటి
నియమ నిబంధనలూ పెట్టకుండా మోటారు వాహనాలు, ఇతర ఉపకరణాలు అందజేయడం మొదలగు
డిమాండ్స్‌ సిపిఐ(యం) బలపరుస్తుందని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

అరెస్టులకు ఖండన
        ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న
సందర్భంగా సిపిఐ(యం) నాయకులు సోమయ్య, రఫీ, రూబెన్‌ లను గృహనిర్బంధం
చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు.
వినతిపత్రం ఇస్తామన్న నిర్వాసితులను పోలీసులు బెదిరించి సభ వద్దకు
రానీయకుండా అడ్డుకోవడం గర్హనీయమన్నారు. నిర్వాసితులకు పునరావాసం
కల్పించకపోగా రాష్ట్ర ప్రభుత్వం వారిని నిర్భందించడం అన్యాయమన్నారు.
ప్రాజెక్టు పూర్తికాలేదు, పునరావాసం పూర్తిగా కల్పించకుండానే ఎన్నికల
లబ్దికోసం ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించడం ప్రజలను
మోసగించడమే. ఈ చర్యలను అందరూ ఖండిరచాలని వి.శ్రీనివాసరావు కోరారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోతే ప్రతిఘటన తప్పదని శ్రీనివాసరావు
హెచ్చరించారు.

  (జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి