
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 ఫిబ్రవరి, 2024.
పాత పెన్షన్ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని అమలు చేయాలని కోరుతూ ఎపిసిపిఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ నిర్భంధించటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఈ చర్యలతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరోసారి బహిర్గతమయింది.
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఎపిసిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపిచ్చిన చలో విజయవాడ భగ్నం చేసి, ఉద్యోగులను రానీయకుండా నిర్భంధించడం గర్హనీయం. చర్చలకని పిలిచి అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటి అయ్యింది. ఈ విధంగా ఉద్యోగుల కనీస ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఉద్యోగులు శుభకార్యాలకు కూడా మండలం దాటి వెళ్లనీయక ఇంటివద్ద, కార్యాలయాల వద్ద పహారా కాయడం అప్రజాస్వామికం.
సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడను రద్దు చేసుకునేట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండిరచాలని కోరతున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి