గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఫిబ్రవరి, 2024.

 

 

గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని  రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థ నిష్పక్షపాతంగా పని చేయాలని కోరింది.

గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ప్రధాన బాధ్యతలు అప్పగించరాదని ఎన్నికల కమీషన్‌ చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి ‘‘మీరే నా భావి లీడర్లు’’ అని సన్మాస సభలో వ్యాఖ్యానించడం అనుచితం. ఈ వ్యాఖ్యలు ఓటర్లను ప్రలోభ పెట్టడాన్కి తప్ప మరొకటి కాదు. నిజంగా వాలంటీర్లపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామ వాలంటీర్లుతో రాష్ట్ర ప్రభుత్వం నానా చాకిరీ చేయించుకుంటున్నది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులతో వాలంటీర్లు దినదినగండంగా గడుపుతున్నారు. కానీ వారికి నామమాత్రమైన వేతనాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది.

కాబట్టి వాలంటీర్లకు సన్మానాల పేరుతో వంచనకు గురిచేయరాదని, రాజకీయ ప్రయోజనానికి వాడుకోకుండా జీతాలు పెంచి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపియం కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి