
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యవసాయశాఖ మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
విజయవాడ,
11 ఫిబ్రవరి, 2024.
గౌరవనీయులైన కాకాణి గోవర్ధన రెడ్డి గారు,
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభమ్ మహేశ్వరి కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...
ఆర్యా!
19.01.2024న శుభమ్ మహేశ్వరి కోల్డ్‌స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 1.2 లక్షల పసుపు బస్తాలు కాలిపోయి రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఈ ప్రమాదంపై గుంటూరు జిల్లా కలెక్టరు వారు కమిటీ వేశారు. ఆ కమిటీ జనవరి 30వ తేదీన సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. విచారణ జరిపి వారం రోజులు గడిచినా రైతులకు సమాచారం తెలియలేదు. రైతులు తమ పసుపు పంట గూర్చి ఆందోళనలో ఉన్నారు. ఆర్ధికంగా నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం ఇప్పించి, ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.
కోర్కెలు:
1. పసుపుకు క్వింటాలుకు రూ.11,000 ఇవ్వాలి.
2. పూర్తి ఇన్సూరెన్సు ఇవ్వాలి.
3. కోల్డ్ స్టోరేజీ అద్దెలు, బ్యాంకు రుణాలు రద్దు చేయాలి
4. బాధిత రైతుల లిస్టు అధికారికంగా ప్రకటించాలి.
5. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేసిన కంపెనీలు ఏమిటో రైతులకు చెప్పాలి.
6. రైతులకు విచారణ నివేదిక పారదర్శకంగా ఇవ్వాలి.
7. కొంతమంది రైతులు బాండ్లు యాజమాన్యానికి ఇచ్చినా సరుకు డెలివరీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టు రికార్డు పుస్తకాల్లో రాసారు. వారికి కూడా నష్టపరిహారం అందాలి.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి