డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

 తేది : 10 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ...

అయ్యా!

రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 2024 డిఎస్సీ కేవలం 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులోనూ వ్యాయమ ఉపాధ్యాయులకు స్థానం కల్పించలేదు. వారీ విషయాన్ని పలు ధఫాలుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ రోజు వారు నా దృష్టికి తీసుకువచ్చారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూల్క్ప్‌ డిఎస్సీ(పిఇటి) ద్వారా పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. వారు అడుగుతున్న కోర్కె న్యాయసమ్మతమైనది. వారిచ్చిన మెమోరాండం జతపరుస్తున్నాను.

వ్యాయమ ఉపాధ్యాయ నిరుద్యోగులు 80వేల మంది ఉన్నారు. ‘‘ ఆడుదాం ` ఆంధ్రా’’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఆటల పోటీలు నిర్వహించింది. ఈ నిరుద్యోగులందరికీ డిఎస్సీ ద్దారా ఉద్యోగాలు కల్పించినట్లయితే స్కూళ్లలో విద్యార్ధులెంతమందో క్రీడాకారులుగా తయారయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కూడా జయప్రదమవుతుంది. లేని యెడల ‘‘ ఆడుదాం ` ఆంధ్రా’’  కేవలం ఆర్భాటంగానే మిగిలిపోతుంది.

కావున మీరు ప్రత్యేకంగా పరిశీలించి డిఎస్సీలో వ్యాయమ ఉపాధ్యాయుల పోస్టులు ప్రకటించి, భర్తీచేయాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి