టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఫిబ్రవరి, 2024.

 

అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవీపల్లి గ్రామం వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణం. సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నది. ఎర్రచందనం స్మగ్లర్లు గత కొంతకాలంగా పేట్రేగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయం. కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి