భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 ఫిబ్రవరి, 2024.
విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్. రమణయ్య దారుణ హత్యను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కాలంలో చెలరేగిపోతున్న ల్యాండ్ మాఫియా ఆగడాలకు ఇది ప్రత్యక్ష తార్కాణం. ఇంత దారుణానికి ఒడిగట్టిన దోషులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. రమణయ్య మృతికి సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు విశాఖతో సహా మరికొన్ని జిల్లాల్లో వెలుగుచూశాయి. ప్రభుత్వం మందకొడితనం వల్ల ఈ శక్తులు ఇంకా పేట్రేగిపోతున్నాయి. ల్యాండ్ మాఫీయాను అరికట్టి విశాఖ, విజయనగరం దాని పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి