వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఐ(యం)పై ఆంక్షలు పై లేఖ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 03 ఫిబ్రవరి, 2024. 

 

శ్రీయుత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

వడ్డేశ్వరం, గుంటూరు జిల్లా.

ఆర్యా!

ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సిపి ‘‘సిద్దం’’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి ఎ.రవి ని పోలీసులు పార్టీ  కార్యాలయంలోనే హౌస్‌అరెస్టు చేశారు. ఎ. రవితో పాటు మరికొందరు కార్మిక నాయకులను కూడా సిఐటియు కార్యాలయంలో నిర్భందించారు. ఒకపార్టీ సభ పెట్టుకుంటే మరొక పార్టీ లేదా సంఘాల నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. అందులో పార్టీ కార్యాలయంలోకి పోలీసులు చొరబడి నిర్భందించడం చట్టవిరుద్ధం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థలో అన్నిపార్టీలకు రాజ్యాంగ రీత్యా సమానమైన అవకాశాలున్నాయి. ఎన్నికలు రానున్న తరుణంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

 

 

కాపీటు,

చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌,

సచివాలయం.