వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఐ(యం)పై ఆంక్షలా?

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఫిబ్రవరి, 2024. 

 

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఐ(యం)పై ఆంక్షలా?

ఏలూరులో జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండన

ఈరోజు దెందులూరులో వైఎస్సార్‌సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి ఎ.రవి ని హౌస్‌ అరెస్టు చేయడం దుర్మార్గం. సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నది. రవితో పాటు మరికొందరు సిఐటియు కార్మిక నాయకులను కూడా దిగ్భందించారు. దీనికి కారకులైన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నది. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిపార్టీలకు రాజ్యాంగ రీత్యా సమానమైన అవకాశాలున్నాయి. కానీ ఒకపార్టీ సభ పెట్టుకుంటే మరొక పార్టీ నాయకులను అరెస్టు చేయడమంటే అది నిరంకుశ రాజ్యం అవుతుంది. ఎన్నికలు రానున్న తరుణంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి