
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 జనవరి, 2024.
అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం`2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే జివో ను ఉపసంహరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్‌వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికం. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేదిస్తూ, సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గం. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరం. రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నది. ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఖండిరచవలసిందిగా సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు అండగా నిలబడవలసిందిగా ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి