
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
పచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 జనవరి, 2024.
సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వారు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.
కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా సమ్మె చేస్తుంటే, సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా వారిని నిందించే విధంగా మాట్లాడడం గర్హనీయం. అలాగే మహిళా ఉగ్యోగుల పట్ల అవమానిస్తూ వ్యాఖ్యానించిన వ్యక్తి ఆ పదవికి అనర్హుడు. కావున అతనిపై తక్షణం చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి