మెగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జనవరి, 2024.

 

డిఎస్సీ ప్రకటించమని బొత్స సత్యనారాయణ క్యాంప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడాన్కి వెళ్ళిన డిఐఎఫ్‌ఐ నాయకులు, డిఎస్సీ అభ్యర్ధులపై దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నది.

గడచిన 5 సం॥ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం డిఎస్సీ ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళనలు సాగుతున్నాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను అరెస్టులు చేయడం అక్రమం. ఇప్పటికైనా వెంటనే డిఎస్సీ ప్రకటించాలని సిపియం డిమాండ్‌ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి