ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 డిసెంబర్‌, 2023.

 

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఎం నాయకుల 

అక్రమ అరెస్టులకు ఖండన

రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన సందర్భంగా సిపిఎం, ప్రతిపక్ష  నాయకులు, అక్రమ అరెస్టులను, ముందస్తు గృహ నిర్భందాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది. అరెస్టు  చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాంను, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌ను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించటం గర్హనీయం. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావును ఉండిలో ఇంటి వద్దనే గృహనిర్భంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష నాయకులను ఇదే రీతిలో ముందస్తు అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధం చేయడం అప్రజాస్వామికం. 

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో సిపిఎం, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను అక్రమ ముందస్తు అరెస్టులు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. ఈ అరెస్టులను ప్రజాతంత్ర వాదులందరూ ఖండిరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తక్షణం అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి