
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 డిసెంబర్, 2023.
రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించి నేటికి నాలుగు సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులకు, కూలీలకు, రాజధాని బాధితులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలుపుతున్నది. వారి పోరాటానికి సంపూర్ణ సంఫీుభావం మరోసారి ప్రకటిస్తున్నది. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. రైతులను వీధుల పాలు చేసింది. చేసిన తప్పును సరిదిద్దు కొని అమరావతినే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వము రాజధాని విషయంలోనూ నాటకాలాడుతూ రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు, బిజెపి విద్రోహానికి వ్యతిరేకంగా ప్రజలంతా అమరావతి పోరాటానికి అండగా ఉండాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి