ఎమ్మెల్సీ సాబ్జి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 15 డిసెంబర్‌, 2023.

 

ఎమ్మెల్సీ సాబ్జి మృతికి సంతాపం

 

      ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ,  ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్‌ సాబ్జి గారి దుర్మరణం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నది. ఆయన మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని నష్టం. ఆకివీడులో అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి భీమవరంలో అదే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

 

పిడిఎఫ్‌ తరఫున శాసనమండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల వాణిని వినిపించడంలో దిట్ట. అన్ని తరగతుల, వర్గాల ప్రజల తరఫున శాసనమండలిలోను, బయట పోరాడుతున్న యోధుడు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తదనంతరం మనరాష్ట్రంలో యుటిఎఫ్‌ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర అధ్యక్షులుగా చాలా కాలం పని చేశారు. అలాంటి నాయకుడిని కారు ప్రమాదంలో కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ లోటు పూడ్చ లేనిది. వారి శ్రీమతి షేక్‌ సుబాని, కుమార్తె అష్రప్‌ బేగం, కుమారుడు అబుల్‌ కలాం ఆజాద్‌ ఇతర కుటుంబ సభ్యులకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి