
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 డిసెంబర్, 2023.
డా॥ బి.ఆర్.అంబేద్కర్‌కు సిపిఐ(యం) నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత, డా॥ బి.ఆర్.అంబేద్కర్ 67వ వర్థంతి సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయంకోసం జీవితాన్ని త్యాగం చేసి మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూస్థాపితం చేయాలని చూస్తున్నదని, పౌరహక్కులు, ప్రాథమిక హక్కుల్ని రద్దుచేసి నిరంకుశ పద్దతిలో పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. మనువాద మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది అగ్రకుల దురహంకారాన్ని అన్ని కులాలమీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మన రాష్ట్రంతోసహా అనేక రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, మహిళలమీద దాడులు అమానుషంగా పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారిమీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరువు హత్యలు జరుగుతున్నాయని, కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణగా ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉద్యోగం గ్యారెంటీ చేసి అండగా ఉండాలని, వారి రక్షణకు ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, ఎ.మాల్యాద్రి, జె.జయరాం, ప్రజారంగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి