కుల గణన సదస్సులకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

విజయవాడ,

 తేది : 14 నవంబర్‌, 2023.

శ్రీయుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,  

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : కుల గణన సదస్సులకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలి

అయ్యా!

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కార్యక్రమ సన్నాహాల్లో భాగంగా ఈ నెల 17 నుండి 22 వరకు జిల్లా స్థాయిలో వర్క్‌ షాపులు, అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే వీటికి ఎవరిని ఆహ్వానిస్తున్నారో స్పష్టంగా ప్రకటించలేదు. రాజమండ్రి మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైనా హాజరు కాదలచుకున్న వారు అప్లై చేసుకోవాలని కోరారు. దాన్ని మీకు ఈ లేఖ వెంట జత చేస్తున్నాను. ఒక ముఖ్యమైన అంశంపై ఇలా క్యాజువల్‌గా ప్రకటించడం కులగణన కార్యక్రమానికి న్యాయం జరగదు. భవిష్యత్తు విధానాలను ప్రభావితం చేసే ఇంత ముఖ్యమైన అంశంపై ఖచ్చితమైన సమాచారం, నిస్పక్షపాతంగా జరగాలంటే రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయడం సరైన పద్దతి. కావున మీరు చొరవ తీసుకొని ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి వారి సూచనలను కూడా తీసుకొని ఈ కార్యక్రమం సమర్దవంతంగా, సమగ్రంగా జరిగే విధంగా చూడాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి