విజయవాడ బస్టాండ్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 నవంబర్‌, 2023.

 

విజయవాడ బస్టాండ్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి

- సిపిఎం డిమాండ్‌

 

విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించడం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలికి తీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది. మృతుల కుటుంబాలకు 50 లక్షలు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడ్డ వారికి సంపూర్ణ వైద్య సహాయం, ఆర్ధిక సహకారం అందించాలని కోరుతున్నది.

ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం గడిరచడంపైన, ప్రభుత్వ ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపైన దృష్టి పెట్టాయి తప్ప ప్రయాణికుల, కార్మికుల భద్రతను, రక్షణను గాలికి వదిలేయటం శోచనీయం. ప్రభుత్వంలో విలీనమైన తరువాత ప్రయాణికుల భద్రత, రవాణా సదుపాయాలు మెరుగవుతాయని అందరూ ఆశించారు. కానీ కాలం చెల్లిన బస్సులు, రిపేర్లపై శ్రద్ధ పెట్టకపోవడం, రిపేర్లకు తగిన నిధులు కేటాయించకపోవడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయకపోవడం తదితర కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల సంఖ్యను కుదిస్తూ పనిభారం పెంచుతున్నారు. దీనితో కార్మిక, ప్రయాణికుల భద్రత లోపిస్తున్నది.

మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి