నిరుద్యోగులను నిరాశపరిచిన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 నవంబర్‌, 2023.

 

నిరుద్యోగులను నిరాశపరిచిన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయాలు నిరాశపరిచాయి. మెగా డిఎస్సీ ప్రకటిస్తామని ఊరించిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చేయకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. రాష్ట్రంలో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విద్యాహక్కు చట్టం ప్రకారం 40 వేలు ఖాళీలున్నాయని ప్రకటించింది. ఈ సంవత్సరం 12 వేలమంది రిటైర్‌ అవుతారు. అయినప్పటికీ ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు నింపుతామని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయం. కాబట్టి ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను నింపి యువతకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని సిపిఎం కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి