రక్తదాహంతోనే ఉరి..

‘డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలంటూ యా కూబ్‌ దాఖలు చేసిన ఆఖరి ఫిర్యాదును సుప్రీం కోర్టు కొట్టివేయడం నిరుత్సాహాన్ని కలిగించింది. ఈ నిర్ణయం సరికాదు. అసంతృప్తితో ఉన్నా. సుప్రీం కోర్టు విషాదకరమైన పొరపాటు చేసిందని నా అభిప్రాయం’ అని యాకూబ్‌ లాయర్‌ ఆనంద్‌ గ్రోవర్‌ అన్నారు. రక్తదాహంతో ఉన్నవారు యాకూబ్‌ను ఉరితీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాకూబ్‌ తరఫు వాదించిన మరో న్యాయవాది మీడియాపట్ల అసహనం వ్యక్తం చేశారు. యాకూబ్‌ ఉరిశిక్షపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా..‘మా కక్షిదారు చనిపోతున్నాడు. నా మీద దయ చూపించండి’అని వ్యాఖ్యానించారు. యాకూబ్‌కు ఉరిశిక్షను అమలు చేయడానికి అంత తొందరెందుకు పడ్డారని మరో సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ ప్రశ్నించారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణపై సవాలు చేసే సమయం యాకూబ్‌కు ఎందుకు ఇవ్వలేదన్నారు.