
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిలోని అంశాలను అమలు చేయవలసిందిగా ఆదేశించే నియమ నిబంధనలు లేవని కేంద్ర హోమ్ శాఖ సహయ మంత్రి హరిబాయి ప్రతిభాయి చౌదరి స్పస్టం చేశారు. తెలుగుదేశం సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు అడిగిన ప్రశ్నకు జవాబుగా మంగళవారం లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 8ని వివిధ అంశాల అమలుకు సంబంధించి ఆయన అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులతో కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షాసమావేశాలు జరుపుతోందని ఆయన చెప్పారు.