
ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాలయాల తరలింపునకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రైవేట్ భవనాలను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు.. ఇరిగేషన్కు సంబంధించిన 9 కార్యాలయాలను తరలించటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.