BJPఅప్పుడు అలా..ఇప్పుడు ఇలా

 పార్లమెంట్‌ను స్తంభింపచేయటం తప్పుకాదనీ, మంత్రుల అవినీతిపై చర్చ జరిగితే ప్రభుత్వం బయటపడిపోతుందే తప్పించి ఒదిగేదేమీ ఉండదని గతంలో వాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు బాణి మార్చి ప్రతిపక్షాలను తప్పుపట్టటం బిజెపి ద్వంద్వనీతికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు. యుపిఏ హయాంలో అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న నట్వర్‌సింగ్, పవన్ కుమార్ బన్సల్, అశ్వనీ కుమార్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే తప్పించి పార్లమెంట్ నడవదని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ సజావుగా నడవాలన్న ఉద్దేశంతో తమ నాయకురాలు సొనియాగాంధీ ఈ మంత్రుల చేత రాజీనామా చేయించారని ఆయన చెప్పారు. ఇప్పుడు తమ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కిమ్మనకపోవటం విడ్డూరంగా ఉందని అన్నారు