కులహత్యలపై సమగ్ర చట్టం:ఐద్వా

పరువు ప్రతిష్టల పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కులదురహంకార హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టాన్ని రూపొం దించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐద్వా ప్రతినిధి వర్గం కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది.ఐద్వా రూపొందించిన ముసాయిదా చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌/కలెక్టర్‌ కులపంచాయితీలపై నిషేధాజ్ఞలు విధించవచ్చని, యువజంట, వారి కుటుంబాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చని వివరించింది. ఐద్వాతో పాటు జాతీయ మహిళా కమిషన్‌, లా కమిషన్‌ కూడా ఇటువంటి ముసాయిదా చట్టాలను రూపొందించాయని ఐద్వా ప్రతినిధి బృందం వివరించింది.