
పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్ ఆరోపించారు.