
రాజ్యసభ సీటు కోసమే రఘువీరా రెడ్డి రాహుల్ గాంధీతో పాదయాత్రలు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతూ అనంతపురానికి ఆనుకొని ఉన్న కర్నాటకలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్ గాంధీ అక్కడ ఎందుకు యాత్రలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ లు కేవలం అనంతపురం, హిందూపూర్ పార్లమెంట్ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.