రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్ర విభజన సమస్యలపై 17వ తేదీ జరగనున్న వివాద పరిష్కార (డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌) సబ్‌కమిటీ సమావేశానికి ఉదయం పంపిన ఎజెండాలో ప్రత్యేకహోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలు పెట్టి తిరిగి సాయంకాలానికే వీటిని ఎత్తివేయడం గర్హనీయం. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, అన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలియజేయాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.  ప్రత్యేక హోదా చర్చకు రాకుండా బిజెపి నాయకత్వం అడ్డుకోవడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. బిజెపి విద్రోహంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గళం విప్పాలి. ప్రత్యేక హోదాను సాధించడానికి అన్ని పార్టీలను, ప్రజలను కూడగట్టి ఢల్లీికి అఖిలపక్ష ప్రతినిధివర్గాన్ని తీసుకుపోవాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపి విద్రోహాన్ని ఖండిరచి కలిసి పోరాటానికి ముందుకు రావాలని కోరుతున్నాం.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి