
2018 నాటికి సీడ్‌క్యాపిటల్‌ను నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 1694.5 హెక్టార్ల(4236 ఎకరాలు)లో దీని నిర్మాణం జరగ నుంది. దీనికిగాను రూ.8214 కోట్లు ఖర్చవుతుం దని అంచనా వేసింది. ఐదుదశల్లో నిర్మించ నున్న రాజధానికి సంబంధించి తొమ్మిది యాక్షన్ ప్లానులు రూపొందించారు. రాజధాని నగరంలో 88 కిలో మీటర్ల పొడవున రోడ్లను నిర్మించనున్నారు. ఐదు దశల్లో ఏ దశలో ఎంత స్థలం వినియోగం అవు తుంది, ఎన్ని ఉద్యోగాలొస్తాయి అనే అంశా లనూ పొందుపరిచారు. సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్ కన్సలెంట్స్ ప్రైవేటు లిమి టెడ్, జురాంగ్ ఇంటర్నేషనల్, మినిస్ట్రీ ఆఫ్ ట్రేండ్ అండ్ ఇండిస్టీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజెస్, సెంటర్ ఫర్ లివబుల్సిటీస్, ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ప్లాను రూపొందిం చాయి. రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి మొదటి దశలో 15,280 హెక్టార్లు, రెండోదశలో 7900 హెక్టార్లు, మూడోదశలో 16,600 హెక్టార్లు విని యోగించనున్నారు. 2050 నాటికి ఈ మూడుదశలూ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం విస్తీర్ణంలో సీడ్ క్యాపిటల్‌ను 1694.5 హెక్టార్లలో నిర్మించనున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, ప్రపంచ స్థాయి నిర్మాణాలు, అన్ని వసతులతోనివాసాలు, సంస్కృతి పరిరక్షణ, వనరుల సద్వినియోగం, పచ్చదనం, పరిశుభ్రం అనే ఏడు అంశాల ఆధారంగా రాజధానిని నిర్మించనున్నారు. సింగపూర్ ప్రభుత్వం అనుంబంధంగా తయారు చేసిన సీడ్ డెవలప్మెంట్ ప్లానును 310-05-04-0001 రిఫెర్స్ నెంబరుతో, ఐఎన్‌ఆర్‌ఐ ఎపి సీడ్ డెవలప్మెంట్ మాస్టర్‌ప్లాను అనే ఫైలు నెంబరుతో సింగపూర్ ప్రభుత్వం ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేసింది. మాస్టర్ ప్లానును తయారు చేసినవారిలో సీనియర్ ఇంజనీర్లు ఆంగ్చిట్ సిక్ ఆశ్విన్, దయానిది తంగవేల్, రక్షద రమేష్ రోడ్, సోనాలి మెహతా ఉండగా దీనికి ప్రాజెక్టు మేనేజర్‌గా కౌస్తుబ్ తమస్కార్ ఉన్నారు, ప్రభుత్వానికి అందించే సమయంలో దయానిది తంగవేల్ ప్లానును అప్రూవల్ చేశారు. దీనికోసం తొలుత రాజధాని నగరానికి సంబంధించిన డాటా తీసుకున్న అధికారులు అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులను సింగపూర్ పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.